
ఘనంగా భాద్రపద పౌర్ణమి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారతోపాటు ఖమాన గ్రామంలోని నాగ్‌సేన్ బుద్ధ విహారలో ఆదివారం భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువు భరద్వాజ్ ఆధ్వర్యంలో విహారాల్లో పూజలు చేశా రు. మహిళలకు అష్ట శీల్ ఉపోసత్ దీక్ష ప్రసాదించారు. మూడు నెలలపాటు నిర్వహించే వర్షవాస్ కాలంలో వచ్చే పౌర్ణమిలను ఎంతో పవిత్రంగా భావించి మహిళలు అష్టాంగ మా ర్గాలు పాటిస్తూ ఉంటారని తెలిపారు. రమాబాయి మహిళా మండలిలోని 30 మంది మహిళలు అష్టశీల్ ఉపోసత్ దీక్ష తీసుకున్నారు. భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, నాయకులు దుర్గాజీ, జయరాం ఉప్రె, శ్యాంరావు దుర్గె, పాండూజీ జాడె, కిషన్ ఖోబ్రగడె ఉన్నారు.