
తగ్గుముఖం పట్టిన పెన్‌గంగ వరద
సిర్పూర్(టి): పెన్‌గంగలో వరద ఉధృతి గు రువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. సిర్పూర్(టి) మండలం హుడ్కిలి సమీపంలోని వంతెన వద్ద వరద తగ్గడంతో హుడ్కిలి, జక్కాపూర్, మాకిడితోపాటు మ హారాష్ట్ర గ్రామాలకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. వెంకట్రావ్‌పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని పెన్‌గంగ నదిపై ఉన్న వంతెన వద్ద వరద తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ రహీముద్దిన్, ఎస్సై కమలాకర్ పెన్‌గంగ నది వరద ఉధృతిని పరిశీలించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వాంకిడి: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025– 26 విద్యాసంవత్సరానికి అతిథి అధ్యాపకుడి నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.కనకయ్య తెలిపారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ బోధించేందుకు పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 9 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.