
గురుభ్యోనమః
అక్షరాన్ని నేర్పే గురువు జీవితానికి మార్గాన్ని చూపిస్తారు. అలాంటి టీచర్ ప్రతిఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు. క్రమశిక్షణ నేర్పించి.. జ్ఞానజ్యోతులు వెలిగించి భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తారు. రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. నేడు మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసి,
బోధనలో ఉత్తమంగా నిలుస్తున్న ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.
ఇంటింటికీ తిరిగి.. ప్రవేశాలు పెంచి
కెరమెరి: మండలంలోని గోయగాం ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పెంచడంలో ఉపాధ్యాయుడు రవితేజ ఎనలేని కృషి చేశారు. కుటుంబ సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికీ తిరిగారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. సొంత ఖర్చుతో కరపత్రాలు ముద్రించి బడిబాట కార్య్రమంలో భాగంగా గ్రామంలో ప్రచారం చేశారు. గతేడాది 40 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 73కు చేరింది. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు సైతం ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకురావడంతో గోయగాం పాఠశాల ప్రైవేట్‌కు దీటుగా కొనసాగుతోంది.

గురుభ్యోనమః

గురుభ్యోనమః