
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్మల్‌లోని దివ్యగార్డెన్స్‌లో నిర్వహించే 6వ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు గురువారం తరలివెళ్లారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏడు కొండలు గురువారం రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికై న క్రీడాకారుల జాబితా విడుదల చేసి, ఎంపికై న వారిని ఆసిఫాబాద్ నుంచి నిర్మల్‌కు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరో తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్, జూనియర్ చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు జరగనున్నాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు ప్ర తిభచూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు బాలుర విభాగంలో ట్రెడిషనల్ యోగాలో మనవ్‌బార్, ఫార్మర్డ్ బెండ్ చిత్యాల శ్రీయాన్, ట్విస్టింగ్ యోగా శ్రీయాన్ గౌడ్, బ్యాక్‌వర్డ్ బెండ్ యోగా బొసెల్లి ప్రతిఖ్, లెగ్ బ్యాలె న్స్ బట్టి అకిల్‌సింగ్, హ్యాండ్ బ్యాలెన్స్ నాగ చైతన్య, సుపిన్‌ఫోజ్ చిట్యాల శ్రీయాన్, అర్టిస్టిక్ సింగల్ అశ్విత్ యాదవ్, ఆర్టిస్టిక్ డబుల్ ఆదర్శ్, సాయి రోహిత్, రిథమిక్ ఫేర్ అశ్విత్, త్రినాథ్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో ట్రెడిషనల్ యోగాలో సాయి ప్రణీత, ఫార్వర్డ్ బెండ్ రసకట్ల స్లోక, ట్విస్టింగ్ వనపర్తి అఖిల, ఆర్టిస్టిక్ సింగల్ కుమ్మరి శ్రీవల్లి ఎంపికయ్యారు.