వానాకాలంలో భగ భగ | - | Sakshi
Sakshi News home page

వానాకాలంలో భగ భగ

Aug 6 2025 7:00 AM | Updated on Aug 6 2025 7:00 AM

వానాక

వానాకాలంలో భగ భగ

● అనుహ్యంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● వారం రోజులుగా జాడలేని వాన ● నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం ● మందకొడిగా సాగుతున్న వరినాట్లు
మంగళవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు

కౌటాల(సిర్పూర్‌): వానాకాలం సీజన్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో అనుహ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు వారం రోజులుగా వాన జాడలేకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌ ప్రారంభమైన తర్వాత జిల్లాలో జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన వర్షాలకు పొలాలను దమ్ము చేయగా, ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కూలీల కొరతతో వరి పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. వర్షాధారంగా సాగు చేసే భూముల్లో నాట్లు వేసేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు.

మండుతున్న సూరీడు..

వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా పగటి పూ ట రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. పగలు, రాత్రి సమయంలో ఉక్కపోత ఉంటోంది. నైరుతి రుతుపవనాలతో ద్వితీయార్థంలో ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా.. ఆగస్టులో ఎండ తీవ్రతకు ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంట లు దాటితే సుర్రుమంటోంది. వ్యవసాయ కూలీలు పనులు చేయడానికి తిప్పలు పడుతున్నారు. సా యంత్రం మబ్బులతో వాతావరణం చల్లబడుతు న్నా రాత్రంతా మళ్లీ ఉక్కపోత కొనసాగుతోంది. భిన్న వాతావరణంతో ఎండ వేడికి తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. మరో మూడు, నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో సాధారణమే..

కార్తెలన్నీ కరిగిపోతున్నా కరువుతీరా వర్షాలు మాత్రం కురవడం లేదు. ఈ వానాకాలంలో సీజన్‌లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 598.5 మి.మీ. సగ టు వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా 598.2 మి.మీటర్లుగా నమోదైంది. జూన్‌, జూలైలో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జైనూర్‌, తిర్యాణి, సిర్పూర్‌(యూ), దహెగాం మండలాల్లో లోటు కనిపిస్తోంది. కాగజ్‌నగర్‌, బెజ్జూర్‌ మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే ఉంది. వారం రోజులుగా వరుణుడి జాడ లేకపోవడంతో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు వరి నాట్లు వేసుకోవచ్చని, ఈ నెలలో భారీ వర్షాలు కురిస్తే పంటల సాగుకు ఇబ్బంది ఉండదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆగస్టులో భారీ వర్షాలు పడకపోతే పంటల సాగుకు దేవుడే దిక్కని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్‌ నుంచి ఆగస్టు 5 వరకు మి.మీ.లలో)

మండలం కురవాల్సింది కురిసింది స్థితి(శాతం)

జైనూర్‌ 640.4 481.4 –25 లోటు

సిర్పూర్‌(యూ) 616.2 424.8 –38 లోటు

లింగాపూర్‌ 598.1 623.0 +4 సాధారణం

తిర్యాణి 513.0 339.7 –22 లోటు

రెబ్బెన 514.9 586.9 +14 సాధారణం

ఆసిఫాబాద్‌ 541.2 601.9 +11 సాధారణం

కెరమెరి 537.7 563.2 +5 సాధారణం

వాంకిడి 568.9 652.1 +15 సాధారణం

కాగజ్‌నగర్‌ 553.4 668.8 +21 అధికం

సిర్పూర్‌(టి) 618.1 643.1 +4 సాధారణం

కౌటాల 660.3 683.2 +3 సాధారణం

చింతలమానెపల్లి 651.7 790.0 +21 అధికం

బెజ్జూర్‌ 667.9 820.8 +21 అధికం

పెంచికల్‌పేట్‌ 663.6 566.5 –11 సాధారణం

దహెగాం 652.8 467.4 –28 లోటు

ప్రాంతం ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్‌)

సిర్పూర్‌(టి) 37.9

బెజ్జూర్‌ 37.7

ఎల్కపల్లి 37.3

కౌటాల 37.0

వెంకట్రావ్‌పేట 36.7

లోనవెల్లి 36.6

దహెగాం 36.4

జంబుగా 36.2

గిన్నెదరి 36.1

వానాకాలంలో భగ భగ1
1/1

వానాకాలంలో భగ భగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement