
ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి
పెంచికల్‌పేట్: ఈ నెల 9న నిర్వహించే ఆది వాసీ దినోత్సవానికి పెద్దఎత్తున తరలిరావా లని రాజ్‌గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోర్ సుధాకర్ పిలుపునిచ్చా రు. మండల కేంద్రంలో మంగళవారం ఆది వాసీ దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ హక్కుల సాధనకు ఆదివాసీలు ఐక్యంగా పోరాటం చేయాలన్నా రు. ప్రతీ గ్రామంలో జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో జిల్లా మేడి కుర్సింగ మోతీరాం, కార్యనిర్వాహక కార్యదర్శి ఆత్రం చందన్‌షా, జిల్లా ప్రధాన కార్యదర్శి గుణవంత్‌రావు, జిల్లా కొలాం సంఘం కార్యదర్శి తిరుపతి, వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, మల్లేశ్, సకారాం, భుజంగరావు, శ్రీనివాస్, సాగర్, వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.