
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల పోరాట సమితి(యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాయకులు చరణ్‌దాస్, శాంతికుమారి మాట్లాడుతూ పీఆర్‌సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏ చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, సర్దుబాటు జీవో 25 సవరణ, రెగ్యులర్ ఎంఈవోల నియామకంతోపాటు 317 జీవోతో నష్టపోయిన టీచర్లకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి బకాయిలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు మంజూ రు చేయాలన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఊశన్న, కేశవ్, శ్రీనివా స్, శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.