
ఎస్పీఎంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక నిరుద్యోగుల కే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యోగ కల్పన పోరాట సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందించారు. ఆ సంఘం కన్వీన ర్ రమేశ్ మాట్లాడుతూ ఎస్పీఎం పునఃప్రారంభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. కోట్ల రాయితీలు, మినహాయింపులు పొంది స్థానికేతరులకు(ఇతర రాష్ట్రాల వారికి) ఉ ద్యోగాలు కల్పించడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు విద్యార్హతలు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని మిల్లులో 75శాతం మంది స్థానిక ఉద్యోగులు విధుల్లో చేరేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హైమద్, తాజొద్దీన్, సాయి తదితరులు ఉన్నారు.