
ఫేక్ వార్త సృష్టించిన వ్యక్తిపై ఫిర్యాదు
కాగజ్‌నగర్‌టౌన్: వివాదాస్పద అంశాన్ని ఓ పత్రిక(సాక్షి కాదు) లోగోతో ఫేక్ వార్త సృష్టించిన వ్యక్తిపై ఆదివారం కాగజ్‌నగర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు టౌన్ సీఐ ప్రేంకుమర్‌కు ఫిర్యాదు చేశారు. కాగజ్‌నగర్ మండలం చింతగూడకు చెందిన లెండుగురే శ్యామ్‌రావు శనివారం వాట్సాప్ గ్రూప్‌ల్లో వివాదా స్పద రాజకీయ అంశాన్ని వార్త పత్రికలో వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో నిందితుడితోపాటు సూత్రదా రులపై చర్యలు తీసుకోవాలని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు టి.సురేందర్‌రావు కోరారు. అనంతరం జర్నలిస్టులు కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజంను కలిసి విషయం వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వార్తను తొలగించాలని ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదని తెలిపారు. కాగా, టి.సురేందర్‌రావు ఫిర్యాదు మేరకు చింతగూడ గ్రామానికి చెందిన లెండుగురే శ్యాంరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.