
పింఛన్ల హామీ నెరవేర్చాలి
కెరమెరి(ఆసిఫాబాద్): అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హా మీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బన్న మూర్తి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వీహెచ్‌పీఎస్, ఎమ్మార్పీ ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడా రు. ఒంటరి మహిళలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హామీ లపై చర్చించేందుకు నిర్వహించే సన్నాహక సభ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తిరుసుల్ల సాయికుమార్, పొర్ల వెంకటేశ్, పిట్టల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.