
13న సీపీఐ జిల్లా మహాసభలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13న సీపీఐ నాలుగో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడా రు. మహాసభల్లో జిల్లాకు సంబంధించిన సమగ్ర అభివృద్ధిని చర్చించి, భవిష్యత్ ఉద్య మ కార్యాచరణ రూపొందించనున్నట్లు పే ర్కొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న వాగ్దానాలు అమలు చేయడంపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ ప్రజాభివృద్ధిలో ప్రభుత్వం సరైన సమయంలో వాగ్దానాలు అమలు పర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపా రు. పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బద్రి సాయి, నాయికిని వెంకటేశ్, అజయ్‌కుమార్, దివాకర్, బుద్దాజీ, శంకర్‌నారాయణ, రంజిత్, పవన్ పాల్గొన్నారు.