
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
దహెగాం(సిర్పూర్): యువకులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాగజ్‌నగర్ డీ ఎస్పీ రామానుజం అన్నారు. మండలంలోని కుంచవెల్లి గ్రామంలో శనివారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు చెడు వ్యసనాలు వీడాలని సూచించారు. మా దకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా వెంటనే 1908, 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ రూరల్ సీఐ శ్రీని వాస్‌రావు, ఎస్సై విక్రమ్, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.