
జీవో 49 రద్దుపై గ్రామాల్లో సీపీఎం ప్రచారం
కాగజ్‌నగర్‌రూరల్: జీవో నంబర్ 49 రద్దు చేయాలని కాగజ్‌నగర్ మండలం రేగులగూడ, ఊట్‌పల్లి గ్రామాల్లో శనివారం సీపీఎం నాయకులు కరపత్రాలతో ప్రచారం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ ఆదివాసీలను జల్ జంగిల్ జమీన్‌కు దూరం చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సీపీఎం ఆధ్వర్యంలో కరపత్రాలతో ప్రచారం చేస్తామని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి, అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్‌కుమార్, చాపిలే సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.