
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
● గ్రూపులు వీడి పార్టీ గెలుపునకు కృషి చేయాలి
● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్
● జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశం
ఫ్లెక్సీ వివాదం
జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం సందర్భంగా ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఫొటో పెట్టకపోవడం ఒక సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడమేనని రెబ్బెన మండల నాయకుడు దుర్గం సోమయ్య అన్నారు. పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ఆసిఫాబాద్: పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, గ్రూపులు వీడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో శనివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన కాంగ్రెస్ సంస్థాగత ని ర్మాణ సమావేశం నిర్వహించగా, అనిల్‌కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ నమ్ముకుని ఉ న్నవారే నిజమైన కార్యకర్తలని, అలాంటి వారికి గు ర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసిన తన కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలు స్థా నిక ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని సూచించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రాస్‌రోడ్ నుంచి ప్రేమల గార్డెన్ వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు స్వాగతం పలికారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ జిల్లా పరిశీలకుడు రమేశ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ సమష్టి కృషితో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీని గెలిపించాలని కోరారు.
18 నెలల్లోనే మార్పు
ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతోపాటు 65వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. గతంలో మంత్రి సీతక్క సహకారంతో ఉపాధిహామీ కింద జిల్లాకు రూ.58 కోట్లు, సీఆర్‌ఆర్ కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన ధరణి పక్కనపెట్టి భూభా రతి చట్టం అమలు చేసిందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది కుట్రలతో ఓటమి పాలయ్యాయనని ఆరోపించారు. తనకు 60 వేలకు పైచిలుకు ఓట్లు సాధించేందుకు సహకరించిన కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. వారికి స్థానిక ఎన్నికల్లో బీఫాంలు ఇస్తే ఆర్థికంగా సపోర్టు చేసి గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తమకు అన్నివిధాలా సహకరిస్తే అన్ని జెడ్పీటీసీ, ఎంపీసీటీ, సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో జిల్లాకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ సర్వే చేయించి గెలుపు గుర్రాలకు బీఫాంలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ సూచించారు. సమావేశంలో నాయకులు నరేశ్ జాదవ్, బాలేశ్వర్‌గౌడ్, అనిల్‌గౌడ్, తిరుపతి, విశ్వనాథ్, గజ్జి రామయ్య, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.