
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడంతో శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆ రోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు అనిల్‌గౌడ్, సోమశేఖర్, చరణ్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.