
కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఆదివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోట్నాక విజయ్, ఉపాధ్యక్షులుగా పుర్క ఉద్దవ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, లక్ష్మి, సుభాష్, కార్యదర్శి గా లక్ష్మణ్, సహాయ కార్యదర్శులుగా స్వప్న, ప్రవీణ్, హరికృష్ణ, తులసీదాస్, రవీందర్, కోశాధికారిగా మంగవతి, ఈసీ సభ్యులుగా జంగు, సాయిబాబా, యాదగిరి, విజయలక్ష్మి, చిన్నక్క, బరికిరావ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి సారంగపాణి పరిశీలకులు గా.. ఎన్నికల అధికారిగా వెంకటేశ్వర్‌రెడ్డి వ్య వహరించారు. గిరిజన క్రీడల అధికారి మీనా రెడ్డి ఎన్నికల నిర్వహణ పూర్తిచేశారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు, రాజేశ్, వాసుదేవరావు, చంద్రశేఖర్‌రెడ్డి, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రవి తదితరులు పాల్గొన్నారు.