
పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్
ఆసిఫాబాద్‌అర్బన్: అనారోగ్యంతో బాధపడు తూ మెరుగైన చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చులు, విద్య, ఇతర అత్యవసర అవసరాల కోసం ఆర్థిక సహాయం కోరినవారికి సీఎంఆర్‌ఎఫ్ గొప్ప అవకాశం అని అన్నారు. అర్హులకు సకాలంలో సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.