
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, నాయకులు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.