
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన విశ్వప్రసాదరావు
ఆసిఫాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ జెండాలు మోసిన వారికి ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ భరోసా ఇచ్చిన ట్లు విశ్వప్రసాదరావు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.