
పదేళ్లు సీఎంగా ఉంటాననడం విడ్డూరం
● బీఆర్‌ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్
● కేతిని ఆశ్రమ పాఠశాల సందర్శన
చింతలమానెపల్లి: రైతుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రిగా ఇంకా పదేళ్లు తానే ఉంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం వి డ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కేతిని గ్రామంలో శనివారం ఆయన ప ర్యటించారు. దిందా వాగులో ప్రమాదవశాత్తు సుమన్ మృతి చెందగా అతడి కుటుంబాన్ని ప రామర్శించారు. సుమన్ కుటుంబాన్ని కలెక్టర్ ఆ దుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. గిరిజన విద్యార్థుల కు భోజనంలో మటన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై విద్యాశాఖ మంత్రి సవతితల్లి ప్రేమ చూపించవద్దని సూ చించారు. కేతిని గ్రామ గిరిజనులకు తునికాకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పో డు రైతులకు యూరియాతో పాటు విత్తనాలు అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేకు గిరి జనుల సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. ఆయన వెంట నియోజకవర్గ కన్వీన ర్ లెండుగురె శ్యాంరావు, మండల కన్వీనర్ గోమాసె లహాంచు, నాయకులు నక్క మనోహర్, శ్రీనివాస్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.