
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో పని చే స్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని పీ డీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశా రు. శనివారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో పని చేస్తున్న వర్కర్లు 15 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధింత అధికారులు చొ రవ తీసుకుని వెంటనే పెండింగ్ వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వర్కర్లు శారద, సరోజ, జ్యోతి, పార్వతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.