
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాల్వాయి
కాగజ్‌నగర్ టౌన్: సిర్పూరు ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. కాజీపేట లో నిర్మిస్తున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన కోసం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు మంత్రితో కలిసి ఆ యన రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలు రైలు సమస్యలు మంత్రి దృష్టి కి తీసుకువెళ్లారు. కాగజ్‌నగర్‌లో వందేభార త్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని, శబరిమల కు వెళ్లే భక్తుల కోసం కేరళ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. కాగజ్‌నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలు నడపాలని, కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ అమృత్ భారత్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.