
ఉత్పత్తికి అంతరాయం కలగనీయొద్దు
రెబ్బెన: వర్షాలు కురిస్తే బొగ్గు ఉత్పత్తికి అంతరా యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే వెంకటేశ్వర్లు సూచించారు. బెల్లంపల్లి ఏరియాలో శనివా రం ఆయన పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి అన్ని విభాగాల అ ధిపతులతో సమావేశమై గోలేటి ఓసీపీ పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఖైరిగూడ ఓసీపీని సందర్శించారు. వ్యూపాయింట్ నుంచి పని స్థలాల ను పరిశీలించారు. బొగ్గు నిల్వలు, వర్షాకాలంలో తీ సుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈస్ట్ వ్యూ పాయింట్ సమీపంలో మొక్కలు నాటారు. వట్టివాగుపై నిర్మిస్తున్న రక్షణ కట్ట పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు నా ణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి డిస్పెన్సరీని సందర్శించారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, మందుల నిల్వల వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవా లని సూచించారు. సీజనల్ వ్యాధులపై ఉద్యోగుల కు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం నర్సరీని పరిశీలించి పెంచుతున్న మొక్కల రకాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమీప గ్రామాల ప్రజలకు మొక్కలు పంపిణీ చేయాలని అ ధికారులకు సూచించారు. ఖైరిగూడ పీవో నరేంద ర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, డీజీఎం సివిల్ మదీనా భాషా, ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, మురళి, జూని యర్ ఫారెస్ట్ అధికారి సుష్మ తదితరులున్నారు.
వెంటనే ప్రమోషన్లు కల్పించాలి
పెండింగ్‌లో ఉన్న ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్లను వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల గ్రేడ్ ప్రమోషన్లు ‘డీ’ నుంచి ‘సీ’ కి, ‘సీ’ నుంచి ‘బీ’కి, ‘బీ’ నుంచి ‘ఏ’ గ్రేడ్ అర్హత సాధించిన ఆపరేటర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కో రారు. గ్రేడ్ ప్రమోషన్లను నిర్ణీత కాలప్రమాణంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బ్రాంచి ఉపాధ్యక్షుడు బ య్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు జూపాక రాజేశ్, మారం శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు గణేశ్, సంతోష్‌కుమార్, లక్ష్మీనారాయణ, రఘుపతి, రమేశ్, ఎండీ ఆజాం తదితరులున్నారు.