
సందర్శించి.. సమస్యలు తెలుసుకుని
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. దివ్యాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరంలో వైద్యపరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు అందించాలని సూచించారు. దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.