
సమ్మె జయప్రదం చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సీఐటీ యూ కార్యాలయంలో సోమవారం ఆశ కార్యకర్తల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించా రు. కేంద్రంలోని బీజేపీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులను బానిసలు గా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్‌లు తె చ్చిందన్నారు. ఆశ కార్యకర్తలకు స్థిరవేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉ ద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో ఆశ కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆశ వర్క్‌ర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగరం పద్మ, నాయకులు భారతి, పంచశీల, అనిత, దేవి, నవీన, కేసరి, శోభ, అనసూర్య, బద్రుబాయి తదితరులు పాల్గొన్నారు.