
నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు రోగులకు తెలిసీతెలియని వైద్యం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రథమ చికిత్స మా త్రమే అందించాలనే, ఇతర కేసులను ప్రభు త్వ ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించా రు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎ లాంటి చికిత్స చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.