
చిన్నారుల మోములో చిరునవ్వులు
● కొనసాగుతున్న ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో రెండు బృందాలు ఏర్పాటు ● బాలకార్మికుల గుర్తింపు కోసం విస్తృతంగా తనిఖీలు ● గతేడాది 61 మంది చిన్నారులకు విముక్తి
పెంచికల్‌పేట్(సిర్పూర్): పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి న బాలలు రెక్కల కష్టం చేస్తున్నారు. పుస్తకాలు, ఆటలతో గడవాల్సిన బాల్యం పరిశ్రమలు, వ్యాపా ర సముదాయాల్లో బందీగా మారుతోంది. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా, బందీలుగా మారిన చిన్నారుల మోములో చిరునవ్వులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ – 11 కార్యక్రమం జూలై 1 నుంచి 31 వరకు కొనసాగనుంది. నెల రోజులపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో తనిఖీలు చేపట్టేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశారు. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించనున్నారు. గతేడాది ఆపరేషన్ ముస్కాన్– 10లో భాగంగా జిల్లావ్యాప్తంగా తనిఖీ లు నిర్వహించి 61 మంది చిన్నారులను గుర్తించా రు. వీరిలో 48 బాలకార్మికులు మంది ఉండగా.. బాల్య వివాహం జరిగిన ఒకరు, బడిమానేసిన పిల్ల లు 12 మంది ఉన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను వారికి అప్పగించారు. అలాగే 2022 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో మొత్తం 143 మందికి విముక్తి కల్పించారు.
విస్తృతంగా తనిఖీలు
జిల్లాలో 335 గ్రామ పంచాయితీలు ఉండగా, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగజ్‌నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. పోలీసు అధికారులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కుల పరిరక్షణ సమితి, విద్యాశా ఖ సమన్వయంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజ న్లలో బందీలుగా ఉన్న బాలలను గుర్తించడానికి రెండు బృందాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ డివిజన్ బృందంలో ఎస్సై యాదగిరి, ఆసిఫాబాద్ డివిజన్ బృందంలో ఎస్సై చంద్రశేఖర్‌రావుతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్, కార్మిక శాఖ నుంచి ఒకరి ని సభ్యులుగా నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లలు, అనాథలు, వీధి బాలలను గుర్తిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, దాబాలు, మిల్లులు, ఇటుక బట్టీల్లో పనిచేసున్న పిల్లలకు విముక్తి కల్పిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అనాథ బాలికలను జిల్లా కేంద్రంలోని వసతి గృహాలకు తరలించి ఉచితంగా విద్య, వైద్యం, భోజన వసతి కల్పించనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ వంటి పట్టణాలకు జిల్లా నుంచి వెళ్లి అనేకమంది రైసు మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అధికారులు వీరిపైనా దృష్టి సారించి పనుల్లో ఉన్న చేరిన చిన్నారులను గుర్తించాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో ఇటీవల మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాలికలు, యువతులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బాలికల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.
బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు
బాలలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. వారి హక్కులను కాలరాస్తూ పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. బడీడు పి ల్లలందరినీ తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు పంపించాలి. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తాం. బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచారం అందించాలి.
– బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి

చిన్నారుల మోములో చిరునవ్వులు