
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
జైనూర్(ఆసిఫాబాద్): సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని జైనూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్కెక్కారు. ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో ఎరువులు చేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో యూరియా కొరత ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.