
కేంద్ర పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి భరత్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పథకాలు నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు చేరేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 117 ఆస్పిరేషనల్ జిల్లాలను గుర్తించగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సైతం ఆస్పిరేషన్ కింద ఎంపికై ందని తెలిపారు. నీతి ఆయోగ్ ద్వారా గిరిజనులకు అందుతున్న మౌలిక వసతుల కల్పన, పథకాలపై వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ ఆస్పిరేషనల్ ప్రాంతంలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీ గిరిజనుల గ్రామాల్లో వసతులు, ఇళ్లు, తాగునీరు, రహదారులు, వైద్య సేవలు, సామాజిక భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాతీయ జల్ మిషన్ కింద శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద వందరోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద ఎంపికై న రహదారులు పూర్తి చేయాలని, పీఎం సమ్మర్ యోజన, పీఎం కిసాన్ కింద అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. పీఎం జన్‌మన్ పథకం కింద 3500 పీవీటీజీ కుటుంబాలకు నివాస గృహాలు నిర్మించాలని సూచించారు.
స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగం
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్ వద్ద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ ఘన స్వాగతం పలికారు. ఎస్పీ పుష్పగుచ్ఛం అందించారు. పోలీస్ సిబ్బంది కేంద్ర సహాయ మంత్రికి గౌరవ వందనం చేశారు.
కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
లైబ్రరీ సందర్శన
శ్యామాప్రసాద్ ముఖర్జీ మిషన్ కింద నిర్మించి న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కేంద్ర సహా య మంత్రి హర్ష్ మల్హోత్రా సందర్శించారు. రీడింగ్ గదులు, లైబ్రరీ గది, మినరల్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకున్నారు. అధికారులతో కలిసి గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జన్కాపూర్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో జాతీయ జల్‌జీవన్ మిషన్ కింద నిర్మించిన శుద్ధ నీటి ట్యాంకు పరిశీలించారు. గ్రామంలోని ఇగురపు లక్ష్మి ఇంటిని సందర్శించి.. శుద్ధజలం సరఫరాపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి