
తుంగమడుగుకు రోడ్డు వేయాలి
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం తుంగమడుగు గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్ డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణానికి ఆనుకు ని ఉన్నా తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, గర్భిణులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మె ల్యే హరీశ్‌బాబు గెలిచిన తర్వాత రోడ్డు వేయిస్తానని చెప్పి.. ప్రస్తుతం పట్టించుకోవడం లేద ని ఆరోపించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి హైదరాబాద్ నుంచి రామోజీఫిల్మ్ సిటికి 40 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రజల సొమ్ముతో హెలీకాప్టర్ వాడుకుంటున్నారన్నారు. రోడ్డు కోసం ధర్నా చేస్తే 30 యాక్టు అమలులో ఉందని, కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం దారుణమన్నారు. అనంతరం గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. మూడో తరగతి విద్యార్థులకు ఒకటో తరగతి పుస్తకం కూడా చదవడం రావడం లేదన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, వీధిలై ట్లు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 15 రోజుల్లో రోడ్డు వేయని పక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహిస్తామని తెలిపారు.