విద్య.. వైద్యం.. విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

విద్య.. వైద్యం.. విజ్ఞానం

Jul 16 2025 4:01 AM | Updated on Jul 16 2025 4:01 AM

విద్య

విద్య.. వైద్యం.. విజ్ఞానం

● ఒకేచోట సేవలు అందేలా మల్టీపర్పస్‌ కేంద్రాలు ● ‘పీఎం జన్‌మన్‌’లో భాగంగా జిల్లాకు 23 సెంటర్లు ● ఒక్కో సెంటర్‌కు రూ.60 లక్షలు ● అన్ని హంగులతో లింబుగూడ కేంద్రం ముస్తాబు ● నేడు ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి

వాంకిడి(ఆసిఫాబాద్‌): పీవీటీజీ గిరిజనుల సమగ్రాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్‌మన్‌ పథకం కింద మల్టీపర్పస్‌ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 23 పీవీటీజీ గ్రామాలకు మల్టీపర్పస్‌ సెంటర్లు మంజూరు చేసింది. వాంకిడి మండలం లింబుగూడలో ఇప్పటికే పనులు పూర్తికాగా.. అధికారులు ప్రారంభానికి సిద్ధం చేశారు. బుధవారం లింబుగూడ మల్టీపర్పస్‌ కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి హర్హ్‌ మల్హోత్రా ప్రారంభించనున్నారు.

ఒకేచోట సదుపాయాలు

విభిన్న జీవన శైలి, తక్కువ జనాభా, స్వతంత్ర ఆర్థి క వ్యవస్థ(వేట, సేకరణ), నిలకడ లేని ఆరోగ్యం, విద్యాస్థాయిలతోపాటు ఇతరులతో పోలిస్తే ఎక్కువ పేదరికం అనుభవిస్తున్న గిరిజనులను కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ సమూహంగా గుర్తించి వారి సమగ్రాభివృద్ధి కృషి చేస్తోంది. పీవీటీజీ గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించడం, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో 2023లో పీఎం జన్‌మన్‌ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద మల్టీపర్పస్‌ కేంద్రాలు నిర్మిస్తోంది. విద్యతో పాటు వైద్యం, విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి సాధించేలా ఒకేచోట సౌకర్యాలు కల్పించనున్నారు. భవనాన్ని అత్యంత ఆధునిక విధానంలో ఆకర్షణీయంగా ని ర్మిస్తున్నారు. భవనం లోపల అంగన్‌వాడీ కేంద్రం, ఏఎన్‌ఎం(హెల్త్‌ సెంటర్‌) కేంద్రం, కంప్యూటర్‌ ల్యా బ్‌, ఆఫీస్‌ రూంలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే మధ్యలో గోళాకారంలో ఒక హాల్‌ నిర్మించా రు. భారీ ప్రొజెక్టర్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. గోడల ను రంగులతో అందంగా గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా గుస్సాడీ, దేవర, తునికాకు సేకరిస్తున్న మహిళ, వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలతో తీర్చిద్దారు. పాఠశాల విద్యార్థులకు ఏఐ బోధన, ప్రొజెక్టర్‌ ద్వారా విజ్ఞాన బోధన అందించనున్నా రు. ఒకేచోట విద్య, వైద్యం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

పనుల్లో నాణ్యతలేమి..!

ఆసిఫాబాద్‌ డివిజన్‌లో పీవీటీజీలు ఉన్నందున మొత్తం 23 మల్టీపర్పస్‌ కేంద్రాలు నిర్మిస్తున్నారు. అందులో మూడు టెండర్‌ దశలో ఉండగా.. మిగిలినచోట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చిస్తుంది. అయితే అందంగా కనిపిస్తున్న భవనాలను క్షుణ్నంగా పరిశీలిస్తే నాణ్యతలేమి బహిర్గతమవుతోంది. వాంకిడి మండలం లింబుగూడ కేంద్రంలో కిటికీలు ప్రారంభానికి ముందే ఊగుతున్నాయి. భవనం ముందు ఏర్పాటు చేసిన మెట్ల టైల్స్‌ దెబ్బతిన్నాయి. వరండా సైతం పగుళ్లు తేలింది. కొన్నిరోజుల క్రితం వర్షాలకు వరండాలో సిమెంట్‌ పైకి లేచింది. జిల్లా అధికారులు గమనించడంతో తిరిగి మరమ్మతు చేయించినట్లు తెలుస్తోంది. ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన తలుపు సక్రమంగా లేదు. ప్రస్తుతం భవనానికి పెయింట్‌ చేసి చిత్రాలు అద్దడంతో లోపాలు బహిర్గతం కావడం డం లేదని తెలుస్తోంది. జిల్లాలోని మిగితా గ్రామాల్లో కేంద్రాల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

మండలాల వారీగా కేంద్రాలు మంజూరైన గ్రామాలు

ఆసిఫాబాద్‌ : బండగూడ, సల్పలగూడ, బనార్‌గూడ, వడిగోంది(ఎన్‌), కుటోడ(కె)

ఎర్రగుట్ట, శాకన్‌గొంది, గుట్టచెల్మ, కౌడియాన్‌ మొవాడ్‌, అడఘాట్‌

వాంకిడి : మన్నెగూడ, లింబుగూడ, ఎనగోంది, సడక్‌గూడ, చౌపన్‌గూడ

కెరమెరి : చింతగూడ, కొలాంగూడ, కొలాంగూడ(అగర్‌వాడ)

తిర్యాణి : కొలాంగూడ(మంగీ),

రెబ్బెన : కొలాంగూడ(గోలేటి)

లింగాపూర్‌ : ములగూడ, రింగారిట్‌

జైనూర్‌ : పానపటార్‌

నేడు లింబుగూడలో ప్రారంభం

కేంద్ర సహాయ మంత్రి హర్హ్‌ మల్హోత్రా బుధవారం తిర్యాణి మండలం సుంగాపూర్‌లో పర్యటించి.. అ క్కడి నుంచి జన్కాపూర్‌ పాఠశాలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సరాసరి మధ్యాహ్నం 12.30 గంటలకు వాంకిడి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం లింబుగూడలో పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

నైపుణ్యాభివృద్ధికి దోహదం

మల్టీపర్పస్‌ కేంద్రాలు గిరిజనులకు విద్య, వైద్యంతోపాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడతాయి. ఈ కేంద్రాల ద్వారా ఒకేచోట విద్య, వైద్యం అందిస్తారు. ఏఐ బోధన, ఇంటర్నెట్‌ పరిజ్ఞానం కల్పించేందుకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాలో మొత్తం 23 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తాం. సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

– రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి

రూ.60 లక్షలతో నిర్మాణం

పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో రూ.60 లక్షలతో మల్టీపర్పస్‌ భవనాలు నిర్మిస్తున్నాం. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం సెంటర్‌(హెల్త్‌ సెంటర్‌), కంప్యూటర్‌ గది, మరుగుదొడ్లు, ప్రొజెక్టర్‌ హాల్‌ వంటివి ఒకేభవనంలో వేర్వేరుగా ఉంటాయి. గిరిజనులకు మౌలిక వసతులు ఒకేచోట లభించనున్నాయి. జిల్లాలో మూడు కేంద్రాల పనులు పూర్తయ్యాయి. మరో మూడు టెండర్‌ దశలో ఉన్నాయి. మిగతా చోట్ల పనులు కొనసాగుతున్నాయి. నాణ్యతతో పనులు చేపడతాం.

– జె.తానాజీ, టీడబ్ల్యూ ఈఈ

విద్య.. వైద్యం.. విజ్ఞానం1
1/1

విద్య.. వైద్యం.. విజ్ఞానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement