
కలెక్టరేట్‌లో ప్రతిరోజూ ప్రజావాణి
● గ్రీవెన్స్ సెల్ ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణితోపాటు ఇక నుంచి ప్రతి రో జూ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని జీ– 3లో ఏర్పాటు చేసి న గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్‌ను అదనపు కలెక్టర్లు దీప క్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రతిరోజూ గ్రీవెన్స్ సెల్‌లో సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్‌సెల్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. రెండు దరఖాస్తులు రాగా, ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. కలెక్టరేట్ ఏవో కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఇందిర గిరిజల వికాసం’ అమలుకు కమిటీలు
ఆసిఫాబాద్: జిల్లాలో ఇందిర గిరి జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిర సౌర గిరిజల వికాసం పథకం మొదటి విడతలో పోడు పట్టా భూములకు సాగునీరు అందించేందు కు బోర్లు, వ్యవసాయ బావులు మంజూరు చేసి, సౌ ర విద్యుత్ అందించనున్నట్లు వివరించారు. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులకు బోరు సౌకర్యం, రెండున్నర ఎకరాల లోపు రైతులుంటే ఇద్దరికి కలిపి బోర్లు, బావి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐదు విడతలుగా కార్యక్రమం ఉంటుందని, అటవీశాఖ నుంచి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. అనంతరం సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, డీఏవో శ్రీనివాసరావు, జిల్లా ఉ ద్యానవన శాఖ అధికారి నదీమ్, మిషన్ భగీరథ ఈ ఈ సిద్దిక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారావు పాల్గొన్నారు.