
ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో రెండోదశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగి సింది. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్‌లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలన్నారు. బోధన, అభ్యసన సామగ్రి ఉపయోగించి విద్యా బోధన చేయాలని, వచ్చే సంవత్సరం నుంచి అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్యా బోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ అమరేందర్, అనురాధ భాయ్, రమేశ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.