
మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: మహనీయుల చరిత్ర, వారి త్యాగాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమశాఖ జిల్లా అధికారి సజీవన్, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు. కుల సంఘాల నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, రేగుంట కేశవ్‌రావు, అలీబిన్ అహ్మద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని ఎస్పీ డీవీ శ్రీని వాసరావు అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీపీవో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంటీఏ ఆర్‌ఐ అంజన్న, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, మహిళా ఎస్సై లావణ్య, ఆర్‌ఎస్సై రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.