
అర్హులకే ‘రాజీవ్ యువవికాసం’
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో అర్హులైన వారికి రాజీవ్ యువవికాసం పథకం వర్తింపజేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్‌జోషితో కలిసి గురువారం వెరిఫికేషన్, బ్యాంక్ సిబిల్ స్కోర్ పరిశీలన ప్రక్రియపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను క్షు ణ్నంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నా రు. సిబిల్ స్కోర్ పరిశీలనలో బ్యాంకర్లు నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ఆసిఫా బాద్ మండలం గుండి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పురో గతిపై సమీక్షించారు. గ్రామంలో ప్రత్యేక నిధుల కింద మంజూరైన పనులు వేగవంతం చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్, మండలస్థాయి అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.