మార్చిలోనే 40 డిగ్రీల ఎండ | - | Sakshi
Sakshi News home page

మార్చిలోనే 40 డిగ్రీల ఎండ

Mar 14 2025 1:53 AM | Updated on Mar 14 2025 1:48 AM

● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● గతేడాదితో పోల్చితే అధికం

తిర్యాణి(ఆసిఫాబాద్‌): వేసవి ప్రారంభంలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ప గటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు మధ్యాహ్నం బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చిలో నే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమో దు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.

40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు

జిల్లాలోని రెబ్బెనలో బుధవారం అత్యధికంగా 40.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే రెండో గరిష్ట ఉష్ణోగ్రత.. గతేడాది మార్చి 12న రెబ్బెనలో 38.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావడం విశేషం. జిల్లాలో గడిచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. తాజాగా బుధవారం రెబ్బెనలో 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కౌటాల, బెజ్జూర్‌లో 40.5, కెరమెరి, దహెగాం, తిర్యాణి మండలాల్లో 40.4, ఆసిఫాబాద్‌లో 40.3, పెంచికల్‌పేట్‌లో 40.2, సిర్పూర్‌(టి)లో 40.1, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 15 మండలాలకు పది మండలాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఆత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

నిర్మానుష్యంగా రోడ్లు

జిల్లాలో మూడు రోజులుగా ఎండలు పెరగడంతో పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రోజంతా కూలర్లకే అతుక్కుపోతున్నారు. ఎండల నేపథ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. ఉపాధిహామీ కూలీలు ఉదయం 9 గంటలకే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. జ్యూస్‌ సెంటర్లు, కొబ్బరిబొండాలు, కీరదోసకాయల దుకాణాలకు జనాల తాకిడి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement