
సైన్స్‌తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం
పెంచికల్‌పేట్(సిర్పూర్): సైన్స్‌తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ అన్నారు. మండలంలోని చేడ్వాయి ఉన్నత పాఠశాలలో బుధవారం మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా పలు ప్రయోగాలు చేశారు. ఆయన మాట్లాడుతూ సైన్స్ ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందన్నారు. పరిశోధన శక్తి పెరిగి నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్‌బాబు, ఉపాధ్యాయులు రాకేశ్, సుమిత, రాజ్‌కమలాకర్‌రెడ్డి, శిల్ప, స్వప్న పాల్గొన్నారు.