ఆసిఫాబాద్‌అర్బన్: ప్రస్తుతం అందిస్తున్న సద రం సర్టిఫికెట్ స్థానంలో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబులిటీ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివా రితో కలిసి జిల్లా పరిషత్, జిల్లా సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమి షనర్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ దివ్యాంగులకు 21 కేటగిరీల్లో యూడీఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు పంపిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సౌ కర్యార్థం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. డీఆర్‌డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఈవీ ఎం గోదాంను సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.