చింతలమానెపల్లి: హిందూ ఆలయాలకు భద్రత క ల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని బీజే పీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆరోపించారు. మండలంలోని డబ్బా గ్రామంలోని సమ్మక్క–సారక్క ఆలయంలో జంపన్న గద్దె మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో శనివారం ఆయన ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడారు. ఆలయంలో జంపన్న గద్దె వద్ద మంటలు అంటుకుని కాలిపోవడం విచారకరమని తెలిపారు. మండలంలో గతంలో ఖర్జెల్లి ముసలమ్మ గుట్ట శివాలయంలో, మండల కేంద్రంలోని చిలకలయ్య ఆలయంలో పలువురు దుశ్చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భద్రత వైఫల్యాల కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినశిక్ష విధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జంపన్న గద్దె మంటల్లో కాలిపోవడంలో వస్తున్న అనుమానాలను పోలీసులు నివృత్తి చేయాలని కోరారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డి మాండ్ చేశారు. ఆలయాల భద్రత విషయంపై పో లీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలి పారు. అక్కడికి చేరుకున్న కౌటాల సీఐ రమేశ్, ఎ స్సై నరేశ్ ఆయనతో మాట్లాడుతూ.. సమ్మక్క గద్దె ల వద్ద సెక్యూరిటీ కెమెరా ఏర్పాటు చేశామని తెలి పారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు డోకె రామన్న, కౌటాల అధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకుడు ఎల్ములె మల్లయ్య తదితరులున్నారు.