పెంచికల్‌పేట్: వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌వో అనిల్ కుమార్ తెలి పారు. కమ్మర్‌గాం గ్రామానికి చెందిన తలండి వెంకటేశ్, సిడాం అశోక్ వన్యప్రాణులను వేటడానికి పంట చేనులో విద్యుత్ తీగలను అమర్చరానే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎఫ్‌ఎస్‌వో జగన్‌మోహన్, ఎఫ్‌బీవో విజయలక్ష్మీ, సిబ్బంది ఉన్నారు.