వరల్డ్‌ లిటరసీ ఫౌండేషన్‌ అంబాసిడర్‌గా హాసినిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ లిటరసీ ఫౌండేషన్‌ అంబాసిడర్‌గా హాసినిరెడ్డి

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

ఖమ్మంమామిళ్లగూడెం: వరల్డ్‌ లిటరసీ ఫౌండేషన్‌ యూత్‌ అంబాసిడర్‌గా ఖమ్మానికి చెందిన రావుల హాసినిరెడ్డి ఎంపికై ంది. ప్రపంచవ్యాప్తంగా 1,300 మంది దరఖాస్తు చేసుకోగా ఆమెను ఎంపిక చేశారు. ఫౌండేషన్‌ యూత్‌ అంబాసిడర్‌ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత పెంపు, సమాజ మార్పునకు దోహదపడే 16 – 26 ఏళ్ల వయస్సు కలిగిన వారిని ఎంపిక చేస్తారు. వీరు నాయకత్వ లక్షణాలు, ప్రజా ప్రాతినిధ్యం, కథా నైపుణ్యాలు, డిజిటల్‌ ప్రభావం అంశాలపై ఆన్‌లైన్‌ ద్వారా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 8న మొదలయ్యే కార్యక్రమంలో భాగంగా ఖమ్మంకు చెందిన హసినిరెడ్డి ఎంపికవడంపై పలువురు అభినందించారు. ఆమె తండ్రి ఆర్‌.కిశోర్‌రెడ్డి ఖమ్మంలో హోమియో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

జిల్లా అథ్లెటిక్స్‌ జట్లు

ఖమ్మంస్పోర్ట్స్‌: జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ జట్ల ఎంపికకు బుధవారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 34 మంది హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన వారితో జట్లు ఎంపిక చేశామని అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎండీ గౌస్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎండీ షఫీక్‌అహ్మద్‌ తెలిపారు. ఈ జట్లు 11, 12వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. కాగా, పలు విభాగాల్లో జిల్లా జట్లకు కె.గోపాలకృష్ణ, పి.జితేందర్‌, పి.అజయ్‌కుమార్‌, ఎం.భార్గవ్‌, జి.వెంకటసాయి, అబ్దుల్‌ రజాక్‌, బి.బన్సీలాల్‌, కె.అశోక్‌ డి.దినేశ్‌కార్తీక్‌, ఎం.దేవిప్రసాద్‌, వివేక్‌చంద్ర, బి.లోకేశ్‌, ఎస్‌.మజీద్‌పాషా, వి.వేణు, ఎం.మురళీకృష్ణ, బి.ప్రసన్నకుమార్‌, కె.మస్తాన్‌, టి.సంజన, ఎ.మైథిలి, డి.బిందు, హజీరా ఫాతిమా, అమినానాజ్‌ ఎంపికయ్యారని తెలిపారు.

బెల్టుషాపులో

మద్యం స్వాధీనం

రూ.1.30 లక్షల విలువైన మద్యం నిల్వ

కారేపల్లి: బెల్టు షాపులో నిల్వ చేసిన మద్యాన్ని ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లి ఎకై ్సజ్‌ శాఖ సీఐ స్రవంతి ఆధ్వర్యాన బుధవారం ఉద్యోగులు పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని గుంపెళ్లగూడెం బెల్టుషాపులో రూ.1.30 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోగా, విచారణ చేపడుతున్నామని సీఐ తెలిపారు.

వడదెబ్బతో వృద్ధుడు మృతి

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లికి చెందిన గుడిపాటి గోపయ్య (75) వడదెబ్బతో మృతి చెందాడు. ఎండల తీవ్రత, వడగాలులతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బుధవారం కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, గోపయ్య మృతదేహం వద్ద సీపీఎం నాయకులు తమ్మినేనివెంకట్రావు తదితరులు నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement