షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురం ఎస్సీకాలనీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఇంట్లోని ఫర్నిచర్‌, నగదు సహా సామగ్రి కాలిపోయాయి. గ్రామానికి చెందిన కోట ఏసు కుటుంబీకులతో కలిసి మంగళవారం రాత్రి ఇంటి బయట నిద్రించాడు. అర్ధరాత్రి సమయాన షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుటుంబీకులు అప్రమత్తం అయ్యేలోగా మంటలు తీవ్రతమై ఇంట్లో దాచిన రూ.1.15 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యా యి. ఈ మేరకు జీపీఓ శ్రీనివాసరావు బుధవారం పంచనామా నిర్వహించారు. అనంతరం సర్పంచ్‌ బొగ్గుల గోవర్దన్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేశారు.

పిడుగుపాటుతో..

వైరారూరల్‌: వైరా మండలం విప్పలమడకలో మంగళవారం రాత్రి కల్లూరి చిన్న కొండయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతోపాటు పిడుగుపడడంతో చిన్నకొండ య్య ఇంట్లోని ఫ్రిజ్‌ ఇతర సామగ్రి కాలిపోయాయి. అలాగే, సమీపంలోని వీరపనేని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో వైరింగ్‌, మరికొందరి ఇళ్లలో ఫ్యాన్లు, ఇన్వర్టర్లు కాలిపోయాయని బాధితులు తెలిపారు. అంతేకాక కొండకొడిమలోని బండి ప్రసాద్‌ ఇంటి ఆవరణలో పిడుగు పడగా సామగ్రి కాలిపోయాయి.

ఆహుతైన రూ.1.15 లక్షల నగదు,

రూ.2 లక్షల సామగ్రి

Advertisement
 
Advertisement
Advertisement