ఆసుపాక వాసికి అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఆసుపాక వాసికి అరుదైన అవకాశం

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన డాక్టర్‌ కున్సోత్‌ అశోక్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం దక్కింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ ఉత్సవ్‌లో భాగంగా బిర్సా లైవ్స్‌ ఇన్‌ న్యూ భారత్‌ వీక్‌ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 40 మందితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా భేటీ కానున్నారు. కాగా, రాష్ట్రపతితో భేటీ కార్యక్రమానికి ఎస్టీ కేటగిరీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారిని ఎంపిక చేయగా, ఈ విభాగంలో అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన డాక్టర్‌ కున్సోత్‌ అశోక్‌ కుమార్‌ ఎంపిక అయ్యారు. ప్రస్తుతం అశోక్‌ కుమార్‌ ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

జూన్‌ 2న రాష్ట్రపతితో భేటీకి ఎంపిక

Advertisement
 
Advertisement
Advertisement