● చిత్రలేఖనం శిక్షణపై విద్యార్థుల ఆసక్తి ● బొమ్మలు గీయడం, రంగులు వేయడంలో తర్ఫీదు
ఖమ్మంగాంధీచౌక్: చిత్రకళ అంటే అందమైన బొమ్మలు గీయడం, వాటికి రంగులు అద్దడం. భావాలు, ఆలోచనలను వ్యక్తీకరించే చిత్రకళపై చిన్నారులు ఆసక్తి పెంచుకుంటున్నారు. పెన్సిల్, సిరాతో బొమ్మలు గీయడమే కాక రంగులతో అందంగా మలిచే ఈ కళ మెదడుకు పదును పెడుతుంది. అందుకే పలు పాఠశాలల్లో డ్రాయింగ్‌ను విద్యలో భాగంగా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం ఆసక్తి ఉన్న విద్యార్థులు మాస్టర్ల వద్ద నేర్చుకుంటున్నారు. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన జె.సంతోష్‌కుమార్ చిత్రకళలో ప్రావీణ్యంతో అనేక అవార్డులు సాధించడమే కాక గిన్నీస్‌బుక్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. కళ్లతో చూసే ఏ దృశ్యాన్ని అయినా ఐదు నిమిషాల్లో కుంచైపె చేర్చే నైపుణ్యం కలిగిన ఆయన పిల్లలకు చిత్రలేఖనం నేర్పిస్తున్నారు.


