పాలిసెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

ఖమ్మంసహకారనగర్‌: పాలిసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాప్‌–15 జాబితాలో స్థానం దక్కింది. ఎంపీసీ విభాగంలో మధిర మండలం సుందరయ్యనగర్‌కు చెందిన కందూరి ఆదిత్యశౌరి, సత్తుపల్లి మండలం అయ్యగారిపేటకు చెందిన మహ్మద్‌ మహమూబ్‌ అర్ఫాజ్‌ అలీ రాష్ట్రస్థాయి ఒకటో ర్యాంకు సాధించడం విశేషం. ఇక ఎంబైపీసీ విభాగంలో అర్ఫాజ్‌ అలీ రాష్ట్రస్థాయిలో ఆరో స్థానాన నిలిచాడు.

జిల్లాలో మొదటి మూడు స్థానాలు..

జిల్లా స్థాయిలో విభాగాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంబైపీసీ విభాగంలో అయ్యగారిపేటకు చెందిన మహబూబ్‌ అర్ఫాజ్‌ అలీ, ఖమ్మం గాంధీచౌక్‌కు చెందిన మారెళ్ల హర్షవర్ధన్‌, న్యూలక్ష్మీపురానికి చెందిన పెరుమాళ్ల నవదీప్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, ఎంపీసీ విభాగంలో సుందరయ్యనగర్‌కు చెందిన కందూరి ఆదిత్యశౌరి, అయ్యగారిపేటకు చెందిన మహబూబ్‌ అర్ఫాజ్‌ అలీ జిల్లా మొదటి ర్యాంకు దక్కించుకోగా, ఖమ్మం ధంసలాపురానికి చెందిన లియాఖత్‌ అర్షియాఖాన్‌, కల్లూరుకు చెందిన ఇనపల సహస్ర రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు.

విద్యార్థులకు అభినందనలు

సత్తుపల్లి/మధిర: పాలిసెట్‌ ఎంపీసీ విభాగంలో సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి అర్ఫాజ్‌ అలీ, మధిర సెయింట్‌ఫ్రాన్సిస్‌ స్కూల్‌ విద్యార్థి ఆదిత్యశౌరి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించగా పలువురు అభినందించారు. వీరిద్దరు 120కి 120 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన నిలిచారు. విద్యార్థులను ఎంఈఓ రాజేశ్వరరావు, పాఠశాలల యాజమాన్యం, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పి.నాగేశ్వరరావు, మేరీ థామస్‌, ఆన్‌ బేబీ, వెంకటనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా అర్ఫాజ్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చదవడంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని చెప్పారు. అలాగే, ఆదిత్యశౌరి మాట్లాడుతూ.. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించాడు.

ఇద్దరికి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు

Advertisement
 
Advertisement
Advertisement