ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడాకారులకు అన్ని వసతులు ఉన్నాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. ఈ మేరకు మరిన్ని వసతుల కల్పన, క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన యువజన, క్రీడోత్సవాలు శనివారం ముగియగా, కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తేదీన నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంపికై న 599 మంది అభ్యర్థుల్లో 310 మందికి ఆఫర్ లెటర్లు అందజేయడమే కాక సీఎంకప్ – 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన 79 మంది క్రీడాకారులు, ఈ నెల 21న నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 432 మందికి పతకాలు అందజేశాక మాట్లాడారు. క్రీడారంగంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానాన నిలుస్తుండగా క్రీడాకారులు మరింత సత్తాచాటాలని ఆకాంక్షించారు.
పర్యాటక ప్రాంతాలపై అవగాహన
పర్యాటక రంగ అభివృద్ధికి యువత పాటుపడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో టూరిజం కిట్‌లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీవైఎస్‌ఓ తుంబూరు సునీల్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్‌కుమార్, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి, ఉద్యోగులు ఉదయ్‌కుమార్, ఎండీ గౌస్, నరేశ్‌నాయక్, జె.చంద్రశేఖర్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


