రేపు మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

రేపు మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

ఖమ్మంమామిళ్లగూడెం: కాంగ్రెస్‌ అనుబంధ మైనారిటీ సెల్‌ జిల్లా కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల నియామకాలు వేగవంతం చేయాలని రాష్ట్ర మైనార్టీ సెల్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిశీలకుడిగా సయ్యద్‌ హజ్మ తుల్లా ఖాద్రీని నియమించారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఈ నెల 25న డీసీసీ కార్యాలయంలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న ముస్లిం మైనార్టీ నాయకు లు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ముగిసిన బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఖమ్మంస్పోర్ట్స్‌: ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియం, సీక్వెల్‌ క్లబ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింట న్‌ పోటీలు శనివారం ముగిశాయి. పోటీలను బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా ప్యాట్రన్లు సుదర్శన్‌రావు, రవిమారుత్‌, అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్‌తో పాటు కమర్తపు ముర ళి, కొంగర శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ ప్రారంభించారు. రాత్రి జరిగిన ముగింపు సమావేశంలో ఖమ్మం ఏసీపీ రమణమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో 26 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో గెలిచినవారు త్వర లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement