కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఖమ్మం – వరంగల్ – కరీంనగర్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టులో ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇంజన్ల కలయికతో కూడిన టెక్‌స్టాక్‌ను ఉపయోగించనున్నారు. కారిడార్ పరిధిలో సుమారు 200 స్మార్ట్ పోల్స్‌తోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో అధునాతన సీసీ టీవీలు ఏర్పాటుచేయడమే కాక పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేస్తారు. తద్వారా ట్రాఫిక్ నియంత్రణ, విపత్తులు ఎదురైనప్పుడు పర్యవేక్షణకు సులువు కానుంది. అలాగే, ముఖ్యమైన ప్రాంతాల్లో మైక్‌లు, టీవీలు ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో ప్రజలకు సూచనలు చేస్తారు.


