జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు (డిగ్రీల్లో)
● పల్లెగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత ● రెడ్ జోన్‌లో జిల్లాలోని 16 ప్రాంతాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. రెండు రోజులుగా నమోదవుతున్న మాదిరిగానే శుక్రవారం కూడా అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా 16 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో ఎండ కొనసాగింది. ఎండకు తోడు వడగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే, గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడా నమోదైనా ఎండ, వేడిగాలులు మాత్రం అలాగే కొనసాగాయి. జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 43.5 నుంచి 46.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
ప్రాంతం ఉష్ణోగ్రత
పల్లెగూడెం 46.3
చింతకాని 46.2
ఖమ్మం
ఖానాపురం పీఎస్ 46.2
కలెక్టరేట్ 46.1
పమ్మి 46.1
బచ్చోడు 46.1
కాకరవాయి 45.9
బాణాపురం 45.8
ఎర్రుపాలెం 45.5
తిమ్మారావుపేట 45.4
ముదిగొండ 45.3
ఏన్కూరు 45.2
రఘునాథపాలెం 45.1
నేలకొండపల్లి 45.1
వైరా 45.1
పెద్దగోపతి 45


