ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 23 2026 12:22 AM | Updated on May 23 2026 12:22 AM

ఖమ్మం వైద్యవిభాగం: ప్రస్తుతం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు సూచించారు. వేసవిలో పిల్లలు, పెద్దలు, గర్భిణులతో పాటు వృద్ధులు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్న సమయాన బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. పిల్లల్లో జ్వరం, తలనొప్పి, వాంతులు, తలతిరగడం. అలసట, అధిక దాహం, చర్మం ఎరుపుగా మారటం, వేగంగా శ్వాస తీసుకోవడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే చల్లని ప్రదేశంలో ఉంచి ఓఆర్‌ఎస్‌ లేదా నీరు ఇవ్వాలని సూచించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే సమీప ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దని డీఎంహెచ్‌ఓ సూచించారు. బయటకు వెళ్తే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తువ్వాలు ఉపయోగించమే కాక తగినంత నీరు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి ద్రవాలు తరచూ తీసుకోవాలని తెలిపారు. గర్భిణీ సీ్త్రలు ఎక్కువసేపు ఎండలో ఉండొద్దని, తరచూ నీరు, పోషక ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. అలసట, తల తిరగడం, వాపు లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఇక వృద్ధుల్లో రక్తపోటు, డయాబెటిస్‌, గుండె జబ్బులు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్‌ రాకుండా తరచుగా ద్రవపదార్థాలు తీసుకోవాలని తెలిపారు.

డీఎంహెచ్‌ఓ రామారావు

Advertisement
 
Advertisement
Advertisement